తాటి ముంజలతో మామిడి కాయ

ABN , First Publish Date - 2015-08-31T20:29:24+05:30 IST

కావలసిన పదార్థాలు: లేత తాటిముంజలు - 6, పండిన మామిడి పండు - 1, తాజా కొబ్బరిపాలు - 1 కప్పు

తాటి ముంజలతో మామిడి కాయ

కావలసిన పదార్థాలు: లేత తాటిముంజలు - 6, పండిన మామిడి పండు - 1, తాజా కొబ్బరిపాలు - 1 కప్పు, బాదం పాలు - 2 టేబుల్‌ స్పూన్లు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అర కప్పు, పంచదార - 2 టేబుల్‌ స్పూన్లు, పాలు - 2 కప్పులు, కుంకుమపువ్వు కాడలు - 4, బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ - అలంకరణకు తగినన్ని.
తయారుచేసే విధానం: తొక్కతీసిన మామిడిపండును, ముంజలను చిన్న చిన్న ముక్కలు (క్యూబ్స్‌) గా కట్‌ చేసి పక్కనుంచాలి. పాలను కొద్దిసేపు మరిగించి కండెన్స్‌డ్‌ మిల్క్‌, పంచదార, కుంకుమపువ్వు కాడలు, కొబ్బరిపాలు, బాదం పాలు కలిపి మిశ్రమం సగమయ్యేవరకు చిన్నమంటపై ఉంచి అడుగంటకుండా తిప్పాలి. పాలు గది ఉష్ణోగ్రతకు వచ్చాక మామిడి, ముంజ ముక్కలు కలిపి ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2015-08-31T20:29:24+05:30 IST