బెండకాయ బజ్జీ

ABN , First Publish Date - 2018-10-06T18:54:37+05:30 IST

బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు- తగినన్ని, నీళ్లు-కొన్ని, ఉప్పు-సరిపడా

బెండకాయ బజ్జీ

కావలసినవి
 
బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు- తగినన్ని, నీళ్లు-కొన్ని, ఉప్పు-సరిపడా.
 
తయారీవిధానం
 
కడాయిలో నీళ్లు పోసి బెండకాయలు, పచ్చిమిర్చి, టొమాటాలు, ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉడికించాలి. స్టవ్‌ మీద మరో కడాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడెక్కాక సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయలు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు అందులో వేసి వేగించాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్న కూరగాయల మిశ్రమంలో ఈ తాళింపు మిశ్రమాన్ని వేసి కలపాలి. బెండకాయ బజ్జీ రెడీ.

Updated Date - 2018-10-06T18:54:37+05:30 IST