మ్యాంగో ఆరెంజ్‌ ఐసీ

ABN , First Publish Date - 2015-08-31T18:39:30+05:30 IST

కావలసినవి: అరకప్పు పంచదార, పెద్ద మామిడి పళ్లు రెండు, ఒక కమలా పండు రసం, ఒక గుడ్డు తెల్లసొన(ఇష్టమైతే)

మ్యాంగో ఆరెంజ్‌ ఐసీ

కావలసినవి: అరకప్పు పంచదార, పెద్ద మామిడి పళ్లు రెండు, ఒక కమలా పండు రసం, ఒక గుడ్డు తెల్లసొన(ఇష్టమైతే), సన్నటి కమలాపండు తొక్క (అలంకరణకు)
ఎలా చేయాలి: పంచదారను కొంచెం వేగించి మూడువందల మిల్లిలీటర్ల నీటిని కలిపి పంచదార కరిగే వరకు స్టవ్‌ మీద ఉంచాలి. ఉడుకుపట్టగానే సెగ తగ్గించి ఐదు నిముషాల పాటు ఉంచి దించేయాలి. మామిడి పండును చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కలు, కమలా పండు రసం, పంచదార పాకం కలిపి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రీజర్‌ ప్రూఫ్‌ గిన్నెలో పోసి రెండు గంటల పాటు ఫ్రీజ్‌ చేయాలి. మరీ గట్టిగా ఫ్రీజ్‌ కానక్కర్లేదు. గుడ్డు వాడేట్టయితే తెల్ల సొనను విడిగా తీసుకోండి. ఫ్రీజర్‌ నుంచి మిశ్రమాన్ని తీసి అందులో కోడిగుడ్డు తెల్లసొన కలిపి బాగా గిలకొట్టాలి. (ఇలా చేయడం వల్ల ఐస్‌ క్రిస్టల్స్‌ కరిగిపోతాయి.) తిరిగి ఈ మిశ్రమాన్ని గట్టిగా అయ్యే వరకు ఫ్రీజ్‌ చెయ్యాలి. సర్వ్‌ చేసే పది నిముషాల ముందు దీన్ని ఫ్రిజ్‌ నుంచి తీసి బయటపెట్టాలి. దీనిపైన కమలా తొక్కను అందంగా అమర్చితే చూడముచ్చటగా ఉంటుంది. చల్లచల్లగా రుచిని ఆస్వాదించొచ్చు.

Updated Date - 2015-08-31T18:39:30+05:30 IST