దానిమ్మ గింజల పచ్చడి

ABN , First Publish Date - 2015-09-01T22:10:58+05:30 IST

కావలసిన పదార్థాలు: (పుల్ల) దానిమ్మ గింజలు - అరకప్పు, (వేగించి పొట్టుతీసిన) పల్లీలు - 1 కప్పు

దానిమ్మ గింజల పచ్చడి

కావలసిన పదార్థాలు: (పుల్ల) దానిమ్మ గింజలు - అరకప్పు, (వేగించి పొట్టుతీసిన) పల్లీలు - 1 కప్పు, పచ్చిమిర్చి - 3, వెల్లుల్లి రేకలు - 2, మినప్పప్పు - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టీ స్పూను, తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: కొద్ది నూనెలో మినప్పప్పు, పచ్చిమిర్చి రెండు నిమిషాలు వేగించి చల్లారనివ్వాలి. మిక్సీలో మినప్పప్పు, పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, దానిమ్మగింజలు, ఉప్పు ఒకటి తర్వాత ఒకటి గ్రైండ్‌ చేయాలి. తర్వాత విడిగా తాలింపు పెట్టుకుని దానిమ్మ మిశ్రమంలో కలపాలి. 

Updated Date - 2015-09-01T22:10:58+05:30 IST