పుచ్చకాయ మసాలా కూర

ABN , First Publish Date - 2018-04-22T00:03:47+05:30 IST

పుచ్చకాయ (తొక్క వెనక భాగంలోని తెల్లని) కండ ముక్కలు - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు...

పుచ్చకాయ మసాలా కూర

కావలసిన పదార్థాలు
 
పుచ్చకాయ (తొక్క వెనక భాగంలోని తెల్లని) కండ ముక్కలు - 2 కప్పులు, ఉల్లిపాయ తరుగు - 1/2 కప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- 1 టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, జీలకర్ర- 1/2 టీ స్పూను, నూనె- 2 టీ స్పూన్లు, ధనియాల పొడి, గరంమసాలా, ఆమ్‌చూర్‌ పొడి - 1/2 టీ స్పూను చొప్పున, పసుపు- పావు టీ స్పూను, ఉప్పు, కారం - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు- 2 టీ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
పాన్లో నూనె వేడి చేసి జీలకర్ర, అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించండి. నిమిషం తర్వాత, పసుపు, ధనియాలపొడి, కారం, ఆమ్‌చూర్‌ కలపండి. ఇప్పుడు ఉల్లి తరుగు వేసి వేగనివ్వండి. ఉల్లి వేగాక కండముక్కలు, ఉప్పుతో పాటు రెండు స్పూన్ల నీళ్లు పోసి, కలిపి మూతపెట్టండి. సన్నని మంటపై మగ్గనివ్వండి. ముక్కలు సగం ఉడికిన తరువాత గరంమసాలా వేసి నీరు ఇగిరిపోయి, ముక్కలు మెత్తబడేవరకు ఉంచి దించేయండి. వడ్డించే ముందు కొత్తిమీర చల్లండి.

Updated Date - 2018-04-22T00:03:47+05:30 IST