చేపలు పెరుగు కూర

ABN , First Publish Date - 2015-08-29T23:01:39+05:30 IST

కావలసిన పదార్థాలు: (చర్మం లేని) కొరమీను చేప - 1 కిలో, నూనె - అరకప్పు, పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయలు - 3

చేపలు పెరుగు కూర

కావలసిన పదార్థాలు: (చర్మం లేని) కొరమీను చేప - 1 కిలో, నూనె - అరకప్పు, పెరుగు - 1 కప్పు, ఉల్లిపాయలు - 3, టమేటోలు - 3, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూను , అల్లం తరుగు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి (నిలువుగా చీరాలి) - 5, కొత్తిమీర - 1 టేబుల్‌ స్పూను. ఉప్పు - రుచికి తగినంత, కారం - 2 టీ స్పూన్లు, పసుపు - పావు టీ స్పూను, ధనియాలపొడి - 1 టీ స్పూను, కస్తూరి మెంతి - 2 టీ స్పూన్లు, గరంమసాల - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : చేపని శుభ్రపరిచి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, దనియాలపొడి, కస్తూరిమెంతి, గరం మసాల, అల్లం, వెల్లుల్లి పెరుగులో వేసి బాగా కలిపి చేపముక్కలకు పట్టించి అరగంట పక్కనుంచాలి. కడాయిలో ఉల్లితరుగు దోరగా వేగాక టమోటా ముక్కలు, చేపముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చేపముక్కలు ఉడికి, నూనె పైకి తేలినప్పుడు కొత్తిమీర చల్లి దించేయాలి.

Updated Date - 2015-08-29T23:01:39+05:30 IST