నెల్లూరు బ్రింజాల్‌(వంకాయ) ఫ్రై

ABN , First Publish Date - 2018-08-21T21:25:58+05:30 IST

గుండ్రని వంకాయలు అరకిలో(రెండు ముక్కలుగా చేసుకోవాలి), ఎండుకొబ్బరి పొడి: కప్పు, ఉల్లిపాయ...

నెల్లూరు బ్రింజాల్‌(వంకాయ) ఫ్రై

కావలసిన పదార్థాలు
 
గుండ్రని వంకాయలు అరకిలో(రెండు ముక్కలుగా చేసుకోవాలి), ఎండుకొబ్బరి పొడి: కప్పు, ఉల్లిపాయ:ఒకటి(కావలసిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి), వెల్లుల్లి :పావుకప్పు, జీలకర్ర: రెండు స్పూన్లు, ఆవాలు: టేబుల్‌స్పూను, పసుపు: చిటికెడు, కారం:రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడ, నూనె: తగినంత, కరివేపాకు: కొద్దిగా.
 
తయారీ విధానం
 
ముందుగా ఉల్లిపాయముక్కలు, కొబ్బరిపొడి, వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర అన్నీ వేసి మసాలా రుబ్బి పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన నూనెలో మసాలా ముద్ద వేసి నూనె పైకి తేలేంత వరకూ వేగనిచ్చి దీనికి వంకాయ ముక్కలు, ఉప్పు, కారం జతచేసి సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇది అన్నం లేదా చపాతీల్లోకి బాగుంటుంది.

Updated Date - 2018-08-21T21:25:58+05:30 IST