పచ్చి బఠాణీ రాగి రొట్టె

ABN , First Publish Date - 2015-09-05T15:11:08+05:30 IST

కావలసిన పదార్థాలు: పచ్చిబఠాణి - 1కప్పు, రాగిపిండి - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, జీలకర్ర

పచ్చి బఠాణీ రాగి రొట్టె

కావలసిన పదార్థాలు: పచ్చిబఠాణి - 1కప్పు, రాగిపిండి - 1 కప్పు, పచ్చిమిర్చి - 2, జీలకర్ర - అర టీ స్పూను, ఇంగువ - చిటికెడు, కొత్తిమీర - గుప్పెడు, పచ్చికొబ్బరి తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, ఉల్లి తరుగు - పావు కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పచ్చిబఠాణీలు కొద్దిగా ఉడికించి మెదపాలి. లోతైన పాత్రలో మెదిపిన బఠాణితో పాటు రాగిపిండి, జీలకర్ర, ఇంగువ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉల్లి తరుగు, ఉప్పు వేసి (బఠాణి తడి సరిపోకపోతే కొద్దిగా నీరు వాడి) ముద్దలా కలపాలి. నిమ్మకాయ సైజులో పిండి తీసుకుని ప్లాస్టిక్‌ పేపర్‌పై సాధ్యమైనంత పలచగా వేళ్లతో వత్తి, పెనంపై నూనె రాసి రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి. పెరుగు, నిమ్మకాయ చట్నీ కాంబినేషన్‌తో వేడివేడిగా తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-05T15:11:08+05:30 IST