బాదం హల్వా

ABN , First Publish Date - 2015-08-30T22:53:22+05:30 IST

కావలసిన పదార్థాలు: బాదం - 250 గ్రా., నెయ్యి - 60 గ్రా., పాలు (వేడివి) - అరలీటరు, పంచదార - పావుకేజి, యాలకులపొడి - అర టీ స్పూను,

బాదం హల్వా

కావలసిన పదార్థాలు: బాదం - 250 గ్రా., నెయ్యి - 60 గ్రా., పాలు (వేడివి) - అరలీటరు, పంచదార - పావుకేజి, యాలకులపొడి - అర టీ స్పూను, కుంకుమపువ్వు - ఆరు కాడలు, నేతిలో వేగించిన కొన్ని బాదం (నిలువుగా కోసుకోవాలి) ముక్కలు అలంకరణకోసం.
తయారుచేసే విధానం: బాదంపప్పుని ముందుగా నానబెట్టి తొక్క తీసి మరీ మెత్తగా కాకుండా రుబ్బుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి ఈ పేస్టుని సన్నని మంటపై దోరగా వేగించి, పాలు కలిపి చిక్కబడేదాక ఉంచాలి. తర్వాత పంచదార వేసి కరిగాక, యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి దించేయాలి. తర్వాత నేతిలో వేగించిన బాదం ముక్కల్ని అలంకరించుకోవాలి.

Updated Date - 2015-08-30T22:53:22+05:30 IST