పెసర వేపుడు

ABN , First Publish Date - 2018-02-10T21:51:47+05:30 IST

పెసరపప్పు- ఒక కప్పు, నీళ్లు- మూడు కప్పులు, పాలకూర- రెండు టేబుల్‌స్పూన్లు (ఆకులు సన్నగా తరిగి...

పెసర వేపుడు

కావలసినవి
 
పెసరపప్పు- ఒక కప్పు, నీళ్లు- మూడు కప్పులు, పాలకూర- రెండు టేబుల్‌స్పూన్లు (ఆకులు సన్నగా తరిగి), నూనె- ఆరు టేబుల్‌స్పూన్లు, ఆవాలు- ఒక టేబుల్‌స్పూను, ఎండు మిర్చి-తగినంత, ఉప్పు-తగినంత.
 
తయారీవిధానం
 
పెసరపప్పును ముద్దగా కాకుండా సరైన పదునులో ఉడకబెట్టాలి. ఉడికిన పప్పును పక్కన పెట్టాలి. పాన్‌ తీసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో నూనె పోయాలి. ఆవాలు, ఎండుమిర్చి, పాలకూర తురుము వేసి వేగించాలి. అది సరిగా వేగిన తర్వాత అందులో ఉడికిన పప్పును, తగినంత ఉప్పును వేయాలి. అలాగే దీంట్లో కొద్దిగా నిమ్మరసం కూడా పిండి పెసర ఫ్రైని బాగా కలపాలి. పెసర వేపుడు రెడీ.

Updated Date - 2018-02-10T21:51:47+05:30 IST