ముంజల పొట్టు కూర

ABN , First Publish Date - 2018-06-02T17:32:59+05:30 IST

తాటిముంజల పొట్టు- ఒక కప్పు, ఉల్లిపాయ-ఒకటి (సన్న ముక్కలుగా తరిగి), కరివేపాకు...

ముంజల పొట్టు కూర

కావలసినవి
 
తాటిముంజల పొట్టు- ఒక కప్పు, ఉల్లిపాయ-ఒకటి (సన్న ముక్కలుగా తరిగి), కరివేపాకు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, పచ్చి శెనగపప్పు, ఎండుమిర్చి), కారం, నూనె.
 
తయారీవిధానం
 
కడాయిలో నీళ్లు పోసి ముంజల పొట్టు, కొద్దిగా ఉప్పు, పసుపులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. పొట్టు ఉడికిన తర్వాత వడగట్టి దాన్ని విడిగా ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
కడాయిలో మూడు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి పోపుదినుసులను వేగించాలి. వేగిన తాలింపులో ఉల్లిపాయముక్కలు, కరివేపాకు, పసుపు వేసి వేగించాలి. తర్వాత ఉడకబెట్టిన తాటిముంజల పొట్టును తాలింపులో వేసి కొద్దిగా కారం కూడా జోడించి కాసేపు వేగించాలి. తాటిముంజల పొట్టు కూర రెడీ.

Updated Date - 2018-06-02T17:32:59+05:30 IST