ఆపిల్‌ పాన్‌ కేక్‌

ABN , First Publish Date - 2015-08-26T21:26:29+05:30 IST

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - అరకప్పు, మైదా - అరకప్పు, బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు, (తొక్కతీసి, తురిమిన) ఆపిల్‌ - 1, పాలు - 3 కప్పులు

ఆపిల్‌ పాన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: గోధుమపిండి - అరకప్పు, మైదా - అరకప్పు, బేకింగ్‌ పౌడర్‌ - 2 టీ స్పూన్లు, (తొక్కతీసి, తురిమిన) ఆపిల్‌ - 1, పాలు - 3 కప్పులు, దాల్చినచెక్క పొడి - 1 టీ స్పూను, పంచదార - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - చిటికెడు, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: ఒక వెడల్పాటి పాత్రలో గోధుమపిండి, మైదా, బేకింగ్‌ పౌడర్‌, పంచదార కలపాలి. అందులోనే తురిమిన ఆపిల్‌గుజ్జు, దాల్చినచెక్క పొడి, పాలు, నూనె కూడా వేసి ఉండలు లేకుండా జారుగా కలిపి పది నిమిషాలు పక్కనుంచాలి. తర్వాత నాన్‌ స్టిక్‌ పెనంపైన అరకప్పు చొప్పున పోస్తూ (స్ర్పెడ్‌ చేయకూడదు), సన్నని మంటపై రెండువైపులా దోరగా కాల్చి తీసేయాలి. వీటిని తేనెలో అద్దుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-26T21:26:29+05:30 IST