ఎగ్‌ వెజిటబుల్‌ ఫ్రైడ్‌రైస్‌

ABN , First Publish Date - 2015-08-29T22:25:30+05:30 IST

కావలసిన పదార్థాలు : కోడిగుడ్లు - రెండు, బియ్యం - అరకిలో, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు

ఎగ్‌ వెజిటబుల్‌ ఫ్రైడ్‌రైస్‌

కావలసిన పదార్థాలు :  కోడిగుడ్లు - రెండు, బియ్యం - అరకిలో, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, బీన్స్‌ ముక్కలు - అర కప్పు, పచ్చిబఠాణీలు - అరకప్పు, పచ్చిమిరపకాయలు - రెండు, సోయాసాస్‌ - చెంచా, టమోటాసాస్‌ - చెంచా, అజినోమోటో - చెంచా, ఉప్పు - తగినంత, కారం - చెంచా, మిరియాలపొడి - అరచెంచా, కొత్తిమీర తురుము - అర కప్పు, నూనె - తగినంత
తయారీ విధానం :
ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో కొంచెం నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత కోడి గుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి. తర్వాత క్యారెట్‌, బీన్స్‌, బఠాణీలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గనివ్వాలి. అందులో సోయాసాస్‌ వేసి బాగా కలపాలి. తర్వాత అందులో అన్నం వేసి అజనొమోటో, టమాటాసాస్‌, సోయాసాస్‌, ఉప్పు, కారం, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. చివరికి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే వేడి వేడి ఎగ్‌ వెజిటబుల్‌ బిర్యాని రెడీ.

Updated Date - 2015-08-29T22:25:30+05:30 IST