కొబ్బరి పాన్‌ కేక్‌

ABN , First Publish Date - 2015-08-30T16:55:06+05:30 IST

కావలసిన పదార్థాలు: (గది ఉష్ణోగ్రతలో ఉండే) గుడ్లు - 4, కొబ్బరిపాలు - 1 కప్పు, వెనీలా ఎసెన్స్‌ - 2 టీ స్పూన్లు

కొబ్బరి పాన్‌ కేక్‌

కావలసిన పదార్థాలు: (గది ఉష్ణోగ్రతలో ఉండే) గుడ్లు - 4, కొబ్బరిపాలు - 1 కప్పు, వెనీలా ఎసెన్స్‌ - 2 టీ స్పూన్లు, తేనె - 1 టేబుల్‌ స్పూను, కొబ్బరి తురుము - అరకప్పు, బేకింగ్‌ సోడా - 1 టీ స్పూను, ఉప్పు - అర టీ స్పూను, కొబ్బరి నూనె లేదా బటర్‌ - కాల్చడానికి సరిపడా.
తయారుచేసే విధానం: నాన్‌స్టిక్‌ పెనాన్ని ముందుగానే చిన్న మంటపై వేడి చేసుకుని ఉంచాలి. ఒక పాత్రలో గుడ్లు బాగా గిలకొట్టి కొబ్బరిపాలు, వెనీలా ఎసెన్స్‌, తేనె కలపాలి. మరోపాత్రలో కొబ్బరి తురుము, బేకింగ్‌ సోడా, ఉప్పు కలపాలి. తర్వాత గుడ్ల మిశ్రమాన్ని కొబ్బరి తురుములోకి వంచి మరోసారి బాగా కలిపి పెనంపై కొబ్బరినూనె/ బటర్‌ రాస్తూ దోశల్లా వేసుకుని రెండువైపులా దోరగా కాల్చుకోవాలి. 

Updated Date - 2015-08-30T16:55:06+05:30 IST