కదంబ కూటు

ABN , First Publish Date - 2015-08-30T19:18:08+05:30 IST

కావలసిన పదార్థాలు : కాయగూరలు : వంకాయలు - 50గ్రా, అరటికాయ - 1, బూడిద గుమ్మడి - 1 ముక్క

కదంబ కూటు

కావలసిన పదార్థాలు : కాయగూరలు : వంకాయలు - 50గ్రా, అరటికాయ - 1, బూడిద గుమ్మడి - 1 ముక్క, గోరు చిక్కుడు - 50గ్రా, బెంగళూరు వంకాయ - 1, కందగడ్డ - 10గ్రా., కాకరకాయ - 1.
ఇతర వస్తువులు : కందిపప్పు - 200గ్రా., శెనగపప్పు - 100గ్రా, మినప్పప్పు - 25గ్రా., ధనియాలు - 30 గ్రా., నూనె - రెండు చెంచాలు, పచ్చి బఠాని - 100గ్రా., ఇంగువ - చిటెకెడు, ఉప్పు - తగినంత, చింతపండు - 20గ్రా., పసుపు - చిటికెడు, ఎండు మిరపకాయలు - 5 గ్రా., పచ్చికొబ్బరి - అరకప్పు, కరివేపాకు - కొద్దిగా.
తయారీ విధానం :
ముందుగా కుక్కర్‌లో గ్లాసు కందిపప్పు, అరగ్లాసు శనగపప్పు విడిగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లుపోసి ఉంచాలి. దానిపై మరో గిన్నెలో పచ్చిబఠాని తగినన్ని నీళ్లుపోసి పెట్టి ఉడికించాలి. కూరగాయలను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని మరో గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడి కించి పెట్టుకోవాలి. తరువాత ఓ బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగిన తరువాత మిరపకాయలు, ధనియాలు, శెనగపప్పు, మినప్పుప్పు, ఇంగువ వేసి తక్కువ మంటపై దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండును నీటిలో నానబెట్టుకుని ఉంచుకోవాలి. పచ్చికొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టిన వాటితో పాటు పచ్చికొబ్బరి తురమును మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మరీ మెత్తగా కాకుండా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద గిన్నె తీసుకుని ఉడికించిన పప్పులు, బఠాని, కాయగూరలను వేసి నాన పెట్టుకున్న చింతపండునుంచి గుజ్జును పిండి తగినంత ఉప్పు, పసుపు వేసి సన్నని మంటపై అడుగు అంటకుండా ఉడికించాలి. తరువాత అందులో నూరి పెట్టుకున్న మసాలను కలిపి గట్టి పడేంత వరకు ఉంచి దించేయాలి. మళ్లీ బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు చిట్లగానే స్టౌ ఆర్పేసి కరివేపాకు వేసి వండి ఉంచిన ‘కూటు’లో కలపాలి. అంతే ‘కదంబకూటు’ రెడీ అయినట్టే. వేడివేడి అన్నంలో నెయ్యితో దీనిని కలుపుకుని తింటే ‘యమా టేస్టీ’గా ఉంటుంది. దీనిని ఇంకా దోసె, ఇడ్లీ, చపాతీలతో కూడా తినవచ్చు. 

Updated Date - 2015-08-30T19:18:08+05:30 IST