మటన్‌ తలకాయ కూర

ABN , First Publish Date - 2015-09-01T15:48:37+05:30 IST

కావలసిన పదార్థాలు: తలకాయ మాంసం - పావుకేజీ, ఉల్లిపాయలు - 3 (ఒకటి పేస్టు చేయాలి, రెండు తరగాలి)

మటన్‌ తలకాయ కూర

కావలసిన పదార్థాలు: తలకాయ మాంసం - పావుకేజీ, ఉల్లిపాయలు - 3 (ఒకటి పేస్టు చేయాలి, రెండు తరగాలి), టమోటాలు (తరుగు) - 2, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి రేకలు - 6, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, గరం మసాల పొడి - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్‌ స్పూను.
తయారుచేసే విధానం: తలకాయ మాంసంలో పసుపు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో తగినంత నీరు పోసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేగాక ఉల్లి పేస్టు, టమోటా తరుగు వేసి మరో రెండు నిమిషాలు వేగించి, గరం మసాల పొడి కలపాలి. ఇప్పుడు ఉడికించిన మాంసం (కుక్కర్లో మిగిలిన నీరుతో పాటు) కలిపి చిక్కబడేవరకు ఉంచాలి. తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర అన్నంలోకి, పరాటాలలోకి కూడా బాగుంటుంది.

Updated Date - 2015-09-01T15:48:37+05:30 IST