దొండకాయ ఉల్లికారం

ABN , First Publish Date - 2015-09-01T22:13:08+05:30 IST

కావలసిన పదార్థాలు: దొండకాయలు - పావుకిలో, పెద్ద ఉల్లిపాయలు - 2, జీలకర్ర - 1 టీ స్పూను

దొండకాయ ఉల్లికారం

కావలసిన పదార్థాలు: దొండకాయలు - పావుకిలో, పెద్ద ఉల్లిపాయలు - 2, జీలకర్ర - 1 టీ స్పూను, ఎండుమిర్చి - 4, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, పసుపు - చిటికెడు, శనగపిండి - 1 టేబుల్‌ స్పూను. ఉప్పు - రుచికి సరిపడా.
తయారుచేసే విధానం: దొండకాయలకు (ఉల్లికారం కూర్చడానికి అనుకూలంగా) నిలువుగా గాట్లు పెట్టుకోవాలి. జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కల్ని నూనెలో వేగించి ముద్దలా నూరుకోవాలి. పసుపు, ఉప్పు, ఉల్లిపాయ మిశ్రమం బాగా కలిపి దొండకాయల్లో కూరాలి. తర్వాత కూరిన దొండకాయల్ని నూనెలో సన్నని మంటపై ఉడికించాలి. దించేముందు శనగపిండి చల్లి మరో 5 నిమిషాలు ఉంచి దించేయాలి.

Updated Date - 2015-09-01T22:13:08+05:30 IST