కొరమీను పొలిచత్తు

ABN , First Publish Date - 2015-11-13T15:21:58+05:30 IST

కావాల్సిన పదార్థాలు: చేపలు - ఒక కిలో(కొరిమీను), వెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు

కొరమీను పొలిచత్తు

కావాల్సిన పదార్థాలు: చేపలు - ఒక కిలో(కొరిమీను), వెల్లుల్లి ముద్ద - 100 గ్రాములు, కారం - రెండు టీ స్పూన్లు, పసుపు - ఒక టీ స్పూను, ఉప్పు - తగినంత, నిమ్మరసం - 30 మి.గ్రా, రిఫైన్‌డ్‌ ఆయిల్‌ - సరిపడా.
తయారీ విధానం:
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పొలుసు తీసేయాలి. మనకి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి తగినంత నూనె పోసి చేప ముక్కల్ని ఎర్రగా వేగించుకోవాలి. మరో కడాయిలో నూనె పోసుకుని ముందు వెల్లుల్లి ముద్ద వేసి ఎర్రగా వేగించుకోవాలి. తర్వాత కారం, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కొంచెంసేపయ్యాక వేగించి పెట్టుకున్న చేపముక్కల్ని వేసి బాగా కలిపి దించేయాలి. కొరమీను పొలిచత్తు తయారయినట్టే.

Updated Date - 2015-11-13T15:21:58+05:30 IST