బాంబినో దిల్‌కుష్‌ రోల్స్‌

ABN , First Publish Date - 2015-11-24T14:17:00+05:30 IST

కావలసిన పదార్థాలు : బీన్స్‌-100 గ్రా, క్యారెట్‌-100 గ్రా, సేమియా-కొద్దిగా, ఉల్లిపాయలు పెద్దవి-2, బఠాణీ-50 గ్రా, మైదాపిండి-150

బాంబినో దిల్‌కుష్‌ రోల్స్‌

కావలసిన పదార్థాలు : బీన్స్‌-100 గ్రా, క్యారెట్‌-100 గ్రా, సేమియా-కొద్దిగా, ఉల్లిపాయలు పెద్దవి-2, బఠాణీ-50 గ్రా, మైదాపిండి-150 గ్రా, నూనె లేదా డాల్డా-తగినంత, ఉప్పు, కారం, గరం మసాలా-తగినంత.
తయారుచేసే విధానం : మొదట మైదాపిండిలో డాల్డా లేదా నూనె, ఉప్పు వేసి పూరీ పిండిలా కలిపి పెట్టుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పూరీల్లా వత్తుకోవాలి. ఫిల్లింగ్‌ కోసం.. పైన పేర్కొన్న కూరగాయలను సన్నగా తరిగి, సగం ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు, కారం, గరం మసాలా కలపాలి. పూరీపై దీనిని సమంగా పరిచి, పూరీని రోల్‌ చేయాలి. ఇలా తయారైన రోల్స్‌ను సేమియాలో అద్ది నూనెలో వేగించాలి. వీటిని టమాట సాస్‌తో తినొచ్చు.

Updated Date - 2015-11-24T14:17:00+05:30 IST