బీట్రూట్ కేక్
ABN , First Publish Date - 2015-12-24T15:57:35+05:30 IST
కావలసిన పదార్థాలు: బీట్రూట్లు - రెండు, మైదా పిండి - రెండు కప్పులు, పంచదార - ఒక కప్పు, నూనె - 250 గ్రాములు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్ పౌడర్ - మూడు టీ
కావలసిన పదార్థాలు: బీట్రూట్లు - రెండు, మైదా పిండి - రెండు కప్పులు, పంచదార - ఒక కప్పు, నూనె - 250 గ్రాములు, కోడిగుడ్లు - నాలుగు, బేకింగ్ పౌడర్ - మూడు టీ స్పూన్లు, ఉప్పు - తగినంత.
తయారుచేయు విధానం: ఒక గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, బీట్రూట్ తురుము వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో కోడిగుడ్డు సొన, పంచదార, నూనె వేసి మిక్సీలో తిప్పాలి. ఇప్పుడు దీన్ని బీట్రూట్ పిండిలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఓవెన్లో 175 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద 40 నిమిషాలపాటు బేక్ చేయాలి.