మింట్‌ లెమినాడో

ABN , First Publish Date - 2017-05-20T21:13:22+05:30 IST

కావలసిన పదార్థాలు నిమ్మరసం- అర కప్పు, పుదీనా- అర కప్పు, అల్లం తురుము- పావు కప్పు, తేనె- పావు

మింట్‌ లెమినాడో

కావలసిన పదార్థాలు 
 
నిమ్మరసం- అర కప్పు, పుదీనా- అర కప్పు, అల్లం తురుము- పావు కప్పు, తేనె- పావు కప్పు, వేడి నీళ్లు- రెండు కప్పులు, నిమ్మకాయ- ఒకటి (గుండ్రని ముక్కలుగా కోసుకోవాలి), ఉప్పు- కొద్దిగా.
 
తయారీ విధానం
పుదీనా తురుము, అల్లం, తేనె కలిపి వేడి నీటిలో అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత నీటిని మాత్రమే వడపోసుకుని, పిప్పిని పిండేసి తీసివేయాలి. ఇందులో నిమ్మరసం, ఉప్పు, నిమ్మకాయ ముక్కలు వేసి ఒక రోజంతా ఫ్రిజ్‌లో నిల్వచేసి, తర్వాతి రోజు ఐస్‌ముక్కలు వేసి సర్వ్‌ చేయాలి.

Updated Date - 2017-05-20T21:13:22+05:30 IST