ఫ్రూట్‌ కేక్‌

ABN , First Publish Date - 2017-12-23T21:42:41+05:30 IST

ఎండిన చెర్రీపళ్ల ముక్కలు, మామిడిపళ్ల ముక్కలు - ఒక్కొక్కటి 1/8 కప్పు, ఎండిన క్రాన్‌బెర్రీస్‌, ఎండుద్రాక్ష- చెరొక పావు కప్పు

ఫ్రూట్‌ కేక్‌

కావలసినవి
 
ఎండిన చెర్రీపళ్ల ముక్కలు, మామిడిపళ్ల ముక్కలు - ఒక్కొక్కటి 1/8 కప్పు, ఎండిన క్రాన్‌బెర్రీస్‌, ఎండుద్రాక్ష- చెరొక పావు కప్పు, సన్నగా తరిగిన క్యాండైడ్‌ సిట్రాన్‌ ముక్కలు- రెండు టేబుల్‌స్పూన్లు, డార్క్‌ రమ్‌- పావు కప్పు, వెన్న-అరకప్పు, బ్రౌన్‌షుగర్‌- పావుకప్పు, గుడ్డు- ఒకటి, మైదాపిండి- అరకప్పు, వంటసోడా- 1/8టీస్పూను, దాల్చినచెక్క పొడి- పావు టీస్పూను, మొలాసిస్‌- పావు కప్పు, పాలు- రెండు టేబుల్‌స్పూన్లు
 
తయారీ విధానం
 
చెర్రీపళ్లు, మామిడి , క్రాన్‌బెర్రీస్‌, ఎండుద్రాక్ష, క్యాండైడ్‌ సిట్రాన్‌ ముక్కలను రమ్‌లో వేసి గాలి చొరకుండా మూతపెట్టి 24 గంటలపాటు నాననివ్వాలి. చిన్న రౌండ్‌ ప్యాన్‌ లేదా లోఫ్‌ ప్యాన్‌లో వెన్న రాసి మన్నికైన పార్చ్మెంట్‌ కాగితాన్ని దానిపై పరచాలి. పెద్ద గిన్నె తీసుకుని అందులో వెన్న, బ్రౌన్‌షుగర్లు వేసి మెత్తగా అయ్యేలా కలపాలి. ఆ మిశ్రమాన్ని గుడ్డులో వేసి బాగా గిలక్కొట్టాలి. తర్వాత మైదాపిండి, వంటసోడా, ఉప్పు, దాల్చినచెక్క పొడిలను బాగా కలిపి వెన్న, చక్కెర మిశ్రమంలో మూడు దఫాలుగా కలపాలి. ఇలా కలిపేటప్పుడు ఒకసారి మొలాసిస్‌, మరోసారి పాలు వేసి కలపాలి. దాన్ని నానబెట్టిన పళ్ల ముక్కలు, నట్స్‌లో వేసి బాగా కలపాలి. మెత్తటి ఈ మిశ్రమాన్ని రెడీగా పెట్టుకున్న పాన్‌లో పోయాలి. ఒవెన్‌లో దీన్ని 45 నిమిషాలపాటు బేక్‌ చేయాలి. తర్వాత పది నిమిషాలపాటు చల్లారనివ్వాలి. రెండు టేబుల్‌స్పూన్ల రమ్‌ను దానిపై చిలకరించాలి. పర్చ్మెంట్‌ కాగితాన్ని, చీజ్‌ కాగితాన్ని కట్‌ చేయాలి. చీజ్‌ క్లాత్‌పై ఒక టేబుల్‌స్పూన్‌ రమ్‌ పోయాలి. పర్చ్మెంట్‌ పేపర్‌ మీద చీజ్‌ క్లాత్‌ను పరవాలి. కేక్‌ని దానిమీద పెట్టాలి. మిగిలిన రమ్‌ను కేక్‌ మీద, దాని చుట్టూతా చిలకరించాలి. కేక్‌ పైభాగాన్ని చీజ్‌ క్లాత్‌తో చుట్టి, ఆ తర్వాత కాగితంతో చుట్టాలి. గాలిచొరబడని టిన్‌లో పెట్టాలి. ఇది పదివారాలపాటు నిలువ ఉంటుంది.

Updated Date - 2017-12-23T21:42:41+05:30 IST