ఠండాయ్‌

ABN , First Publish Date - 2019-03-16T19:23:05+05:30 IST

యాలకులు - పది, సోంపు - ఒకటిన్నర టీస్పూన్‌, మిరియాలు - అర టీస్పూన్‌, ధనియాలు - అరటీ స్పూన్‌

ఠండాయ్‌

కావలసిన పదార్థాలు
 
యాలకులు - పది, సోంపు - ఒకటిన్నర టీస్పూన్‌, మిరియాలు - అర టీస్పూన్‌, ధనియాలు - అరటీ స్పూన్‌, పుచ్చకాయ గింజలు - 1 టీ స్పూన్‌, బాదం - 50గ్రా, పంచదార - 5 టేబుల్‌ స్పూన్లు, గులాబీ రేకులు - 3 టేబుల్‌ స్పూన్‌లు, రోజ్‌వాటర్‌ - 2 టేబుల్‌ స్పూన్లు, పాలు - ముప్పావు లీటరు.
 
తయారీవిధానం
 
ఒక పాత్ర తీసుకుని యాలకులు, సోంపు, మిరియాలు, ధనియాలు, పుచ్చకాయ గింజలు, బాదం పలుకులను కాస్త దోరగా వేగించుకోవాలి. రోజ్‌వాటర్‌ తీసుకుని అందులో వేయించిన పదార్థాలను వేయాలి. తర్వాత పంచదార కలుపుకుని ఒక రెండు గంటల పాటు పక్కనపెట్టేయాలి. ఆ మిశ్రమాన్ని గ్రైండ్‌ చేసి పేస్ట్‌ మాదిరిగా చేసుకోవాలి.
చివరగా పాలు కలుపుకోవాలి. ఒక పలుచటి వస్త్రం లేక జాలి సహాయంతో వడబోసుకుని గులాబీ రేకులతో గార్నిష్‌ చేసుకొని చల్లచల్లగా అందించాలి.

Updated Date - 2019-03-16T19:23:05+05:30 IST