బీన్స్‌ పొరియల్‌

ABN , First Publish Date - 2020-01-25T16:38:04+05:30 IST

కావలసినవి: ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావుకేజీ, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - అర టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌,

బీన్స్‌ పొరియల్‌

కావలసినవి: ఫ్రెంచ్‌ బీన్స్‌ - పావుకేజీ, కొబ్బరి తురుము - మూడు టేబుల్‌స్పూన్లు, కారం - అర టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - పావు టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఎండు మిర్చి - ఒకటి, పసుపు - అర టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత.
 
తయారీ: బీన్స్‌ శుభ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.
పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి వేయాలి. ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి. తరువాత కట్‌ చేసి పెట్టుకున్న బీన్స్‌ వేసి కలుపుకోవాలి. పసుపు, తగినంత ఉప్పు వేసి మరికాసేపు వేగనివ్వాలి.చిన్నమంటపై ఉడికించాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు కారం, కొబ్బరి తురుము వేసి కలియబెట్టుకుని మరికాసేపు ఉడికించుకుని దింపుకోవాలి. బీన్స్‌ పొరియల్‌ అన్నంలోకి రుచిగా ఉంటుంది.

Updated Date - 2020-01-25T16:38:04+05:30 IST