పచ్చిమామిడి- తెల్ల శెనగల పచ్చడి

ABN , First Publish Date - 2016-04-28T19:52:30+05:30 IST

కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము- 3 కప్పులు, కాబూలీ శెనగలు- 1/2 కప్పు, పసుపు- 1 టీ స్పూను, కారం- 2 టేబుల్‌ స్పూన్లు, వేగించిన మెంతులు- 1/2 టీ స్పూను, మెంతిపొడి- 1 టేబుల్‌ స్పూను, ఆవపిండి-

పచ్చిమామిడి- తెల్ల శెనగల పచ్చడి

కావలసిన పదార్థాలు: మామిడికాయ తురుము- 3 కప్పులు, కాబూలీ శెనగలు- 1/2 కప్పు, పసుపు- 1 టీ స్పూను, కారం- 2 టేబుల్‌ స్పూన్లు, వేగించిన మెంతులు- 1/2 టీ స్పూను, మెంతిపొడి- 1 టేబుల్‌ స్పూను, ఆవపిండి- 3/4 టేబుల్‌ స్పూను, వేగించిన జీలకర్ర- 1/2 టీ స్పూను, ఎండుమిర్చి- 6, ఉప్పు- 2 టేబుల్‌ స్పూన్లు, ఆవనూనె- 4 కప్పులు .
 
తయారీ విధానం: ఒక పాత్రలో మామిడి తురుము, పసుపు, ఉప్పు వేసి రెండు గంటలు ఉంచాలి. తరువాత మామిడి తురుమును గట్టిగా పిండి, వచ్చిన నీటిని ఒక పాత్రలోకి పట్టాలి. ఆ నీటిలో మెంతులు, శెనగలు వేసి ఒక రాత్రంతా నానబెట్టాలి. తురుమును ఫ్రిజ్‌లో పెట్టి ఉంచాలి. తరువాతి రోజు మామిడి తురుములో కారం, మెంతిపొడి, ఆవపిండి, వేగించిన జీలకర్ర, ఎండుమిర్చి, నానబెట్టిన మెంతులు, శెనగలను కూడా వేసి బాగా కలపాలి. ఆ తరువాత నూనె మరిగించి, చల్లార్చి ఈ మిశ్రమంలో పోయాలి. ఈ పచ్చడిని గాజు సీసాలోకి తీసి వారం రోజులపాటు రోజూ రెండుమూడు గంటలు ఎండలో పెట్టి ఆ తరువాత వాడుకోవచ్చు. ఈ పచ్చడి దాదాపు సంవత్సరం నిలువ ఉంటుంది.

Updated Date - 2016-04-28T19:52:30+05:30 IST