కార్న్ హల్వా
ABN , First Publish Date - 2016-11-26T20:07:23+05:30 IST
కార్న్ హల్వా
కావలసిన పదార్థాలు
దంచిన స్వీట్ కార్న్ - 1 కప్పు
పాలు - 1 కప్పు
నెయ్యి - 1 కప్పు
ఖోయా - 1 కప్పు
బొంబాయి రవ్వ - 1 టీస్పూను
పంచదార - అర కప్పు
కుంకుమ పువ్వు - చిటికెడు
యాలకుల పొడి - తగినంత
బాండీలో నెయ్యి వేసి కార్న్ వేసి 10 ని.లు చిన్న మంట మీద వేయించాలి.
తర్వాత బొంబాయి రవ్వ వేసి అంచులకు అంటకుండా కలపాలి.
పాలు, ఖోయా వేసి చిక్కబడే వరకూ ఉడికించాలి.
తర్వాత చక్కెర వేసి దగ్గరగా ఉడికాక యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి కలపాలి.
పొయ్యి మీద నుంచి దింపి బాదం పలుకులతో అలంకరించి వడ్డించాలి.