దోసకాయ పచ్చడి

ABN , First Publish Date - 2017-02-18T16:57:55+05:30 IST

పచ్చ దోసకాయ పెద్దది- ఒకటి, కొత్తిమీర తరుగు-రెండు కప్పులు, పచ్చిమిర్చి-ఎనిమిది,

దోసకాయ పచ్చడి

కావలసినవి: పచ్చ దోసకాయ పెద్దది- ఒకటి, కొత్తిమీర తరుగు-రెండు కప్పులు, పచ్చిమిర్చి-ఎనిమిది, ఉప్పు-రుచికి సరిపడా, చింతపండు-కొద్దిగా, నూనె-ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు, మినప పప్పు, మెంతులు- ఒక్కో టీస్పూన్‌ చొప్పున, ఎండుమిర్చి- ఒకటి, ఇంగువ-కొద్దిగా.

తయారీ: దోసకాయ తొక్కు తీసి మధ్యకు కోసి లోపలి గింజలు తీసేసి చేదు చూశాక చిన్న ముక్కలుగా కోయాలి. బ్లెండర్‌ జార్‌లో పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు వేసి కచ్చాపచ్చాగా పట్టాలి. తరువాత కొత్తిమీర తరుగు వేసి మెత్తటి గుజ్జులా చేయాలి. అవసరమనుకుంటే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని దోసకాయ ముక్కల్లో వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, మెంతులు, మినప పప్పు, ఇంగువ వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఎండుమిర్చి ముక్కలు వేయాలి. ఈ తాలింపును దోసకాయ ముక్కల మిశ్రమంలో వేయాలి.

Updated Date - 2017-02-18T16:57:55+05:30 IST