బీట్‌రూట్ హల్వా

ABN , First Publish Date - 2017-02-18T17:14:48+05:30 IST

బీట్‌రూట్‌ తురుము- 3 కప్పులు, పాలు- 2 కప్పులు, చక్కెర- ఒక కప్పు, నెయ్యి- 3 టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి- అర టీస్పూను, బాదం, జీడిపప్పు- కొద్దిగా.

బీట్‌రూట్ హల్వా

బీట్‌రూట్‌తో కూరలు, ఫ్రైలు చేయడం గురించి వినే ఉంటారు. చట్నీలు కూడా తినే ఉంటారు. ఇవే బీట్‌రూట్‌ను చర్మ సౌందర్యం కోసం వినియోగించడం కూడా తెలిసే ఉంటుంది. మరి ఎర్రటి ఈ బీట్‌రూట్‌తో తీయతీయని స్వీట్ తయారు చేస్తే.. అందులోనూ అది హల్వా అయితే.. వినడానికి వెరైటీగా ఉండటమే కాదు.. తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది కూడా. మరి ఆ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుని.. ఎంచక్కా ఇంట్లోనే వండుకుని తినేయండి..  
 
 
కావలసిన పదార్థాలు: బీట్‌రూట్‌ తురుము- 3 కప్పులు, పాలు- 2 కప్పులు, చక్కెర- ఒక కప్పు, నెయ్యి- 3 టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి- అర టీస్పూను, బాదం, జీడిపప్పు- కొద్దిగా.
 
తయారీ విధానం: ఒక బాణలిలో పాలు, బీట్‌రూట్‌ తురుము వేసి ఉడికించాలి. బీట్‌రూట్‌ మెత్తగా ఉడికిన తర్వాత చక్కెర కూడా వేసి బాగా కలుపుతూ మరో పావుగంట సేపు ఉడికించాలి. ఆ తర్వాత యాలకుల పొడి, నేతిలో వేగించిన బాదం, జీడిపప్పు వేసి దించేయాలి.

Updated Date - 2017-02-18T17:14:48+05:30 IST