టొమాటో ఉల్లిపాయ చట్నీ

ABN , First Publish Date - 2017-02-25T16:56:18+05:30 IST

టొమాటో ఉల్లిపాయ చట్నీ

టొమాటో ఉల్లిపాయ చట్నీ

తరిగేటప్పుడు ఎంతో ఇబ్బంది పెట్టి ఏడిపించే ఉల్లిపాయ వేసవిలో చల్లని తల్లిలా కాపాడుతుంది. ఉల్లిపాయల్లో ఉండే విటమిన్‌ సి వ్యాధినిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లలతో పోరాడుతుంది. తెలుపు, ఎరుపు, సాంబారు ఉల్లిపాయలు ఏవైనా ఆహారంలో చేర్చుకుంటే వేసవిలో వచ్చే అనేక సమస్యలనుంచి బయటపడొచ్చు.
 
కావలసినవి
పల్లీ నూనె - రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు - కొన్ని, మినపప్పు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఎండుమిర్చి - నాలుగు, కరివేపాకులు - కొన్ని, ఉల్లిపాయలు (మీడియం సైజ్‌) - మూడు, టొమాటోలు (మీడియం సైజ్‌) - నాలుగు (కచ్చాపచ్చాగా తరిగి), ఉప్పు - ఒక టీస్పూన్‌, చింతపండు - పదిగ్రాములు లేదా ఒక రూపాయి నాణెం సైజులో, బెల్లం - ఒక టీస్పూన్‌
 
తయారీవిధానం
పాన్‌లో నూనె వేడిచేసి ఆవాలు వేయాలి. అవి చిటపటమంటున్నప్పుడు మినపప్పు, ఎండుమిర్చి వేసి వేగించాలి.
తరువాత కచ్చాపచ్చాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసి.. ఉల్లిముక్కలు బంగారు రంగుకి వచ్చే వరకు వేగించాలి.
తరువాత టొమాటోలు, ఉప్పు వేసి ఓ మాదిరి మంట మీద ఐదు నిమిషాలు వేగించాలి లేదా టొమాటోలు మెత్తబడేవరకు ఉంచాలి. స్టవ్‌ ఆపేసి చింతపండు, బెల్లం వేయాలి.
ఈ మిశ్రమాన్ని పాన్‌లో నుండి బయటకు తీసి చల్లారనివ్వాలి. తరువాత మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్‌ చేయాలి. రుబ్బేటప్పుడు నీళ్లు కలపొద్దు.
ఇడ్లీ లేదా దోసెల్లో తింటే యమ్మీగా ఉంటుంది. ఫ్రిజ్‌లో ఉంచితే ఈ చట్నీ రెండు రోజుల పాటు ఉంటుంది.

Updated Date - 2017-02-25T16:56:18+05:30 IST