పుదీనా చట్నీ

ABN , First Publish Date - 2017-02-25T16:54:12+05:30 IST

మంచి సువాసనలు అందించే పుదీనా ఆకులు ఆరోగ్యాన్ని కూడా అంతే బాగా

పుదీనా చట్నీ

మంచి సువాసనలు అందించే పుదీనా ఆకులు ఆరోగ్యాన్ని కూడా అంతే బాగా ఉంచుతాయి. వీటి వాసన మంచి ఫీలింగ్‌ని కలిగించడమే కాకుండా ఎపిటైజర్‌గా కూడా పనిచేస్తుంది. పొట్టని చల్లబరిచి నీరసాన్ని పారదోలుతుంది పుదీనా. ఈ మ్యాజికల్‌ హెర్బ్‌ వేసవిలో మిమ్మల్ని చల్లగా ఉంచి శక్తిని అందించేందుకు సాయపడుతుంది.
 
కావలసినవి
పుదీనా ఆకులు (సన్నగా తరిగి) - అరకప్పు, కొత్తిమీర (సన్నగా తరిగి)- ఒక కప్పు, వెల్లుల్లి రెబ్బలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - చిన్నది, పంచదార - ఒక టీస్పూన్‌, నిమ్మరసం - ఒక టీస్పూన్‌, ఉప్పు - పావు టీస్పూన్‌, నీళ్లు - ఒక టేబుల్‌ స్పూన్‌.
 
తయారీవిధానం
వెల్లుల్లి, మిర్చి, అల్లం, పంచదార, ఉప్పులను మిక్సీ జార్‌లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్‌ చేయాలి.
తరువాత కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి నిమ్మరసం, ఒకటేబుల్‌ స్పూన్‌ నీళ్లు కలిపి మెత్తటి గుజ్జులా గ్రైండ్‌ చేయాలి. అంతే రుచికరమైన పుదీనా చట్నీ రెడీ.
ఇది శాండ్‌విచ్‌ చట్నీలా బాగుంటుంది. దీన్ని వెంటనే తినొచ్చు. గాలిచొరబడని సీసాలో పెట్టి.. ఫ్రిజ్‌లో ఉంచితే మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుంది.
ఇందులోనే రెండు టేబుల్‌ స్పూన్ల పెరుగు కలిపితే పకోడా లేదా శాండ్‌విచ్‌లకి మింట్‌ డిప్‌లా పనికొస్తుంది.
అర కప్పు తాజా కొబ్బరి తురుము కలిపితే దోసెల్లోకి చట్నీ బాగుంటుంది.
మూడు టేబుల్‌ స్పూన్ల నీళ్లు కలిపితే భేల్‌పూరి లేదా సమోసా చాట్‌కి పనికొస్తుంది.
రెండు టీస్పూన్ల పుట్నాలపప్పు లేదా పల్లీలు కలిపి మిక్సీ పడితే మిశ్రమం చిక్కగా వస్తుంది.

Updated Date - 2017-02-25T16:54:12+05:30 IST