సజ్జ బూరెలు

ABN , First Publish Date - 2017-09-23T23:25:23+05:30 IST

సజ్జపిండి - 2 కప్పులు, తురిమిన బెల్లం - ఒక కప్పు, నీరు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు..

సజ్జ బూరెలు

కావలసిన పదార్థాలు
 
సజ్జపిండి - 2 కప్పులు, తురిమిన బెల్లం - ఒక కప్పు, నీరు - 2 కప్పులు, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, యాలకుల పొడి - అర టీ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
 
దళసరి అడుగున్న లోతైన పాత్రలో నీటితో పాటు బెల్లం వేసి మరిగించాలి. తీగపాకం రాగానే యాలకుల పొడి వేసి, సజ్జపిండి కొద్దికొద్దిగా ఉండలు చుట్టకుండా కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని బూరెల్లా వత్తి నూనెలో దోరగా వేగించాలి. ఇష్టమైతే నూనెలో వేసేముందు నువ్వులు లేదా గసగసాలు అద్దుకోవచ్చు.

Updated Date - 2017-09-23T23:25:23+05:30 IST