కందగడ్డ పిట్టు

ABN , First Publish Date - 2017-10-14T22:31:12+05:30 IST

కంద - అరకేజీ, ఉల్లి, టమోటా తరుగు - అర కప్పు చొప్పున, కారం, ధనియాల పొడి, ఆవాలు, శనగపప్పు...

కందగడ్డ పిట్టు

కావలసిన పదార్థాలు
 
కంద - అరకేజీ, ఉల్లి, టమోటా తరుగు - అర కప్పు చొప్పున, కారం, ధనియాల పొడి, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు - ఒక టీ స్పూను చొప్పున, పసుపు - పావు కప్పు, కరివేపాకు - 4 రెబ్బలు, కొత్తిమీర తరుగు - కొద్దిగా, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత.
పేస్ట్‌ కోసం: అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 4, సోంపు - అర టీ స్పూను, పచ్చిమిర్చి -ఒకటి.
 
తయారుచేసే విధానం
 
శుభ్రం చేసిన కందను ముక్కలుగా తరిగి సరిపడా నీరు పోసి మెత్తగా ఉడికించాలి. చల్లారిన తర్వాత బాగా మెదిపి గాలికి ఆరనివ్వాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేగించాలి. ఉల్లి తరుగు, టమోటా తరుగు, ఉప్పు వేసి 5 నిమిషాల తర్వాత బరకగా రుబ్బుకున్న పేస్టు వేయాలి. పేస్టు పచ్చివాసన పోయేవరకు వేగించి కారం, ధనియాల పొడి, పసుపు కలపాలి. ఆ తర్వాత కంద గుజ్జు వేసి సన్నమంటపై 10 నిమిషాలు ఉంచి దించేయాలి. ఈ పిట్టు అన్నంలో కలుపుకున్నా, పెరుగన్నంతో నంజుకున్నా బావుంటుంది.

Updated Date - 2017-10-14T22:31:12+05:30 IST