బీట్‌రూట్‌ చట్నీ

ABN , First Publish Date - 2017-12-10T00:13:18+05:30 IST

బీట్‌రూట్‌ ముక్కలు - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు, నువ్వుల నూనె - ఒక టీ స్పూను...

బీట్‌రూట్‌ చట్నీ

కావలసిన పదార్థాలు
బీట్‌రూట్‌ ముక్కలు - ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము - పావుకప్పు, నువ్వుల నూనె - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా. వేగించడానికి : నువ్వుల నూనె - ఒక టీ స్పూను, మినప్పప్పు - ఒక టేబుల్‌ స్పూను, ధనియాలు - ఒక టీ స్పూను, ఎండుమిర్చి - 4, నువ్వులు - ఒక టీ స్పూను, (ఇష్టమైతే) అవిశ గింజలు - ఒక టీ స్పూను.
 
తయారుచేసే విధానం
ముందుగా బీట్‌రూట్‌ ముక్కల్ని ఆవిరిపై ఉడికించాలి. ఇప్పుడు నూనెలో ఉడికిన బీట్‌రూట్‌ ముక్కల్ని వేసి తడి పొయ్యేవరకు వేగించి పక్కనుంచాలి. అదే పాన్‌లో పప్పులు, మిర్చి, ధనియాలు నూనెలో దోరగా వేగించాలి. తర్వాత బీట్‌రూట్‌ ముక్కలు, కొబ్బరి తురుము, తాలింపు దినుసులు, ఉప్పు .. అన్నీ కలిపి బరకగా రుబ్బుకోవాలి.

Updated Date - 2017-12-10T00:13:18+05:30 IST