మిఠాయి డెజర్ట్‌

ABN , First Publish Date - 2018-07-07T16:43:15+05:30 IST

పెసరపప్పు బర్ఫీ-రెండు, మోతీచూర్‌ లడ్డు-ఒకటి, బాదంపప్పులు, జీడిపప్పులు-ఒక్కొక్కటీ మూడేసి చొప్పున

మిఠాయి డెజర్ట్‌

కావలసినవి: పెసరపప్పు బర్ఫీ-రెండు, మోతీచూర్‌ లడ్డు-ఒకటి, బాదంపప్పులు, జీడిపప్పులు-ఒక్కొక్కటీ మూడేసి చొప్పున, ఎండుద్రాక్షలు-ఎనిమిది, పాలు-కొద్దిగా, యాలకులపొడి- కొద్దిగా (డెజర్ట్‌పైన చల్లడానికి).
 
తయారీ: జీడిపప్పులు, బాదంపప్పులను సన్నటిముక్కలుగా చేయాలి. మైక్రోవేవ్‌ బౌల్‌లో పెసరపప్పు బర్ఫీ, మోతీచూర్‌ లడ్డు పెట్టి ముఫ్ఫైసెకన్ల పాటు మైక్రోవేవ్‌లో వేడిచేయాలి. రెండు విడి బౌల్స్‌ తీసుకుని వాటిల్లో పెసరపప్పు బర్ఫీ, మోతీచూర్‌ లడ్డులను చిన్నచిన్న ముక్కలుగా చిదమాలి. పెసరపప్పు బర్ఫీని చిదిమిన తర్వాత అందులో రెండు టేబుల్‌స్పూన్ల పాలు పోసి అవి బాగా కలిసిపోయే దాకా స్టవ్‌ మీద సన్నని మంటపై ఉంచాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత యాలకుల పొడిని వేసి కలపాలి. అలాగే వేరే బౌల్‌లో మోతీచూర్‌ లడ్డును కూడా చిదిమి అందులో రెండు టేబుల్‌స్పూన్ల పాలు పోసి స్టవ్‌ మీద సన్ననిమంటపై ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత అందులో కొద్దిగా యాలకులపొడి వేసి కలపాలి. చిన్న గ్లాసులు తీసుకుని అందులో మోతీచూర్‌ లడ్డు, బర్ఫీ పొడులను విడి విడిగా ఒకదానిపై మరొకటి పొరలు పొరలుగా వేయాలి. దానిపై జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్షలను చల్లి పెడితే చిన్నారులు, పెద్దలు ఇద్దరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు.

Updated Date - 2018-07-07T16:43:15+05:30 IST