చామదుంప సూప్‌

ABN , First Publish Date - 2018-08-04T21:43:11+05:30 IST

సగ్గుబియ్యం - ముప్పావు కప్పు, చామదుంపలు - వంద గ్రాములు, కొబ్బరి పాలు - రెండు కప్పులు, పంచదార - అరకప్పు...

చామదుంప సూప్‌

కావలసిన పదార్థాలు
 
సగ్గుబియ్యం - ముప్పావు కప్పు, చామదుంపలు - వంద గ్రాములు, కొబ్బరి పాలు - రెండు కప్పులు, పంచదార - అరకప్పు.
 
తయారుచేసే విధానం
 
ముందుగా దుంపల తొక్క తీసి శుభ్రం చేసి ముక్కలుగా తరగాలి. తర్వాత ఒక పాన్‌లో నీరుపోసి దుంప ముక్కల్ని మెత్తబడే వరకు ఉడికించి మెదపాలి. మరో పాన్‌లో రెండు కప్పుల నీరు మరిగించి, నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. కొబ్బరిపాలు,
మెదిపిన చామదుంపలు వేసి కొద్దిసేపు తర్వాత పంచదార కలపాలి. సూప్‌ చిక్కబడ్డాక వేడివేడిగా వడ్డించాలి

Updated Date - 2018-08-04T21:43:11+05:30 IST