కోకోనట్‌ గుజియా

ABN , First Publish Date - 2019-03-16T19:27:08+05:30 IST

నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు, ఉప్పు - చిటికెడు, గోధుమ పిండి - అరకిలో

కోకోనట్‌ గుజియా

కావలసిన పదార్థాలు
 
నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు, నీళ్లు - ఒక కప్పు, ఉప్పు - చిటికెడు, గోధుమ పిండి - అరకిలో, కోవ - ఒక కప్పు, మవా (కండెన్సెడ్‌ మిల్క్‌) - ఒక కప్పు, పంచదార - ఒక కప్పు, పిస్తా - 100గ్రా, కొబ్బరి పొడి - 100గ్రా, నూనె, పంచదార పాకం - తగినంత.
 
తయారీవిధానం
 
ఒక వెడల్పాటి పాత్రలో పిండి తీసుకొని, కొన్ని నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
కోవా తీసుకొని, మవా, పంచదార, పిస్తా, కొబ్బరి పొడి వేసి మిశ్రమాన్ని కలుపుకోవాలి.
తర్వాత పక్కన పెట్టుకున్న చిన్న చిన్న గుజియా ఉండలను తీసుకుని, పూరీల మాదిరిగా చేసుకుంటూ మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, పూరీని మధ్యలోకి మడవాలి.
మిశ్రమం బయటకు రాకుండా చివరలు నెమ్మదిగా ఒత్తాలి. ఇలా చేసుకున్న గుజియాలను నూనెలో గోధుమ వర్ణంలోకి వచ్చే వరకు వేయించుకోవాలి.
తరువాత పంచదార పానకంలో వేసి తీయాలి.
తియ్యగా ఉండే కోకోనట్‌ గుజియాలు భలే రుచిగా ఉంటాయి.

Updated Date - 2019-03-16T19:27:08+05:30 IST