పరుప్పు పాయసం

ABN , First Publish Date - 2019-08-31T16:06:30+05:30 IST

పెసరపప్పు - పావుకప్పు, నెయ్యి - ఒకటిన్నర టీస్పూన్‌, నీళ్లు - రెండుకప్పులు, బెల్లం - పావుకప్పు, యాలకులు

పరుప్పు పాయసం

కావలసినవి
 
పెసరపప్పు - పావుకప్పు, నెయ్యి - ఒకటిన్నర టీస్పూన్‌, నీళ్లు - రెండుకప్పులు, బెల్లం - పావుకప్పు, యాలకులు - నాలుగు, కొబ్బరిపాలు - అరకప్పు, జీడిపప్పు - ఐదు పలుకులు, ఎండు కొబ్బరి - ఒకటి.
 
తయారీవిధానం
 
పాన్‌లో అర టీస్పూన్‌ నెయ్యి వేసి పెసరపప్పు వేగించాలి. కాసేపు వేగిన తరువాత రెండు కప్పుల నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. మరొకపాత్రలో బెల్లం వేసి నీళ్లు పోసి కరిగించాలి. ఈ పానకాన్ని వడగట్టి, ఉడికించిన పెసరపప్పులో పోసి మరోసారి ఉడికించాలి. యాలకుల పొడి వేసి, కొబ్బరి పాలు పోసి మరికాసేపు ఉడికించాలి.
మిగిలిన నెయ్యిలో జీడిపప్పు, ఎండు కొబ్బరి తురుము వేగించి పాయసంపై చల్లితే రుచి అదుర్స్‌.

Updated Date - 2019-08-31T16:06:30+05:30 IST