చక్కెర పొంగలి

ABN , First Publish Date - 2019-10-05T19:30:13+05:30 IST

బియ్యం - ఒక కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - పావుకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, జీడిపప్పు - పది పలుకులు,

చక్కెర పొంగలి

కావలసినవి
 
బియ్యం - ఒక కప్పు, బెల్లం - ఒకటిన్నర కప్పు, పెసరపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి - పావుకప్పు, యాలకుల పొడి - పావు టీస్పూన్‌, జీడిపప్పు - పది పలుకులు, ఎండు ద్రాక్ష - రెండు టేబుల్‌స్పూన్లు, పచ్చ కర్పూరం పొడి - చిటికెడు, జాజికాయ పొడి - చిటికెడు, నీళ్లు - నాలుగు కప్పులు.
 
తయారీవిధానం
 
బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. ఒక పాన్‌లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకోవాలి. అప్పుడు బెల్లం పానకం సరిగ్గా ఉన్నట్టు. తరువాత ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. చిన్నమంటపై నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి.యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి. నెయ్యిలో వేగించిన జాజికాయ పొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించి మిశ్రమంలో కలిపితే... చక్కెర పొంగలి రెడీ.

Updated Date - 2019-10-05T19:30:13+05:30 IST