క్యారెట్‌ జింజర్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-11-23T14:31:24+05:30 IST

క్యారెట్లు - 350గ్రాములు, అల్లం - ఒకటేబుల్‌స్పూన్‌(చిన్నగా తరిగినది), ఉల్లిపాయలు - కొద్దిగా, ఉప్పు - తగినంత,

క్యారెట్‌ జింజర్‌ సూప్‌

కావలసినవి : క్యారెట్లు - 350గ్రాములు, అల్లం - ఒకటేబుల్‌స్పూన్‌(చిన్నగా తరిగినది), ఉల్లిపాయలు - కొద్దిగా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - పావు టీస్పూన్‌, నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, కొత్తిమీర, పుదీనా - కొద్దిగా.
 
తయారీ విధానం: ముందుగా క్యారెట్లు తురుముకోవాలి. ఉల్లిపాయలు కట్‌ చేసుకోవాలి. పాన్‌లో నూనె వేసి కొద్దిగా వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. కాసేపయ్యాక అల్లం వేసి మరికాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టాలి. తరువాత ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి చిన్నమంటపై ఉడికించాలి. క్యారెట్లు ఉడికిన తరువాత మిక్సీలో వేసి మరో అరకప్పు నీళ్లు పోసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని మళ్లీ పాన్‌లోకి తీసుకొని మరో అరకప్పు నీళ్లు పోసి కలపాలి. చిన్నమంటపై ఉడికించాలి. మిరియాల పొడి చల్లుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఆకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-23T14:31:24+05:30 IST