బీట్‌రూట్‌, కోకోనట్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-11-23T14:30:09+05:30 IST

క్యారెట్‌ - ఒకటి, నూనె - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - ఒకటి, నిమ్మ ఆకులు - నాలుగైదు, ఉల్లికాడలు -

బీట్‌రూట్‌, కోకోనట్‌ సూప్‌

కావలసినవి : క్యారెట్‌ - ఒకటి, నూనె - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - ఒకటి, నిమ్మ ఆకులు - నాలుగైదు, ఉల్లికాడలు - రెండు, బీట్‌రూట్‌ - ఒకటి, వైట్‌ వెనిగర్‌ - ఒక టేబుల్‌స్పూన్‌; వెజిటబుల్‌ స్టాక్‌ - 250ఎం.ఎల్‌, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - కొద్దిగా, కొబ్బరి పాలు - 200 ఎం.ఎల్‌, క్రీమ్‌ - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీ విధానం: పాన్‌లో నూనె వేసి అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, నిమ్మ ఆకులను వేగించాలి. కాసేపయ్యాక బీట్‌రూట్‌ తురుమును కలపాలి. వైట్‌ వెనిగర్‌ వేయాలి. తరువాత క్యారెట్‌ ముక్కలు వేసి మరికాసేపు వేగనివ్వాలి. వెజిటబుల్‌ స్టాక్‌ వేసి, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరిపాలు పోసి కలియబెట్టాలి. చిన్నమంటపై పదినిమిషాలు ఉండనివ్వాలి. తరువాత మిక్సీలో వేసి పట్టుకోవాలి. కొద్దిగా క్రీమ్‌ వేసుకొని సర్వ్‌ చేసుకోవాలి. చల్లగా కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టుకొని సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2019-11-23T14:30:09+05:30 IST