ఫిష్‌ టిక్కా

ABN , First Publish Date - 2019-11-30T17:11:56+05:30 IST

చేపలు - అరకిలో, పెరుగు - ఒక కప్పు, కారం - ఒకటిన్నర స్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌,

ఫిష్‌ టిక్కా

కావలసిన పదార్థాలు: చేపలు - అరకిలో, పెరుగు - ఒక కప్పు, కారం - ఒకటిన్నర స్పూన్‌, మిరియాల పొడి - అర టీస్పూన్‌, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పసుపు - పావు టీస్పూన్‌, నిమ్మరసం - రెండు టేబుల్‌ స్పూన్లు, గరంమసాలా - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, నూనె - సరిపడా, సెనగపిండి - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి.
 
తయారీ విధానం: చిక్కటి పెరుగు తీసుకోవాలి. ఒకవేళ పెరుగులో నీళ్లుంటే పలుచని వస్త్రంలో పోసి గట్టిగా పిండి నీళ్లు తీసేయాలి. తరువాత కాసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. చేపలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. తరువాత ఉప్పు, మిరియాల పొడి, కారం, నిమ్మరసం, అల్లంవెల్లుల్లి పేస్టు పట్టించాలి. పెరుగు, సెనగపిండి వేసి ముక్కలకు సమంగా పట్టేలా కలపాలి. ఈ చేప ముక్కలను 6 నుంచి 8 గంటల పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు చేప ముక్కలను పుల్లకు గుచ్చి ఓవెన్‌లో పావు గంట పాటు ఉడికించాలి. గరంమసాలా, ధనియాల పొడి చల్లుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-30T17:11:56+05:30 IST