పొటాటో గ్రాటిన్‌

ABN , First Publish Date - 2020-01-04T16:32:44+05:30 IST

బంగాళదుంపలు - నాలుగు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు - రెండు, జాజికాయ పొడి - చిటికెడు, క్రీమ్‌ - 20ఎంఎల్‌, జున్ను - 40 గ్రాములు

పొటాటో గ్రాటిన్‌

కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు - నాలుగు, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత, వెల్లుల్లి రెబ్బలు - రెండు, జాజికాయ పొడి - చిటికెడు, క్రీమ్‌ - 20ఎంఎల్‌, జున్ను - 40 గ్రాములు, వెన్న - 10గ్రాములు, వాము - ఒక టీస్పూన్‌.
 
తయారీ విధానం: బంగాళదుంపలు శుభ్రంగా కడిగి పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని వెన్న రాసి బంగాళదుంప ముక్కలను పరుచుకోవాలి. మరొక పాత్రలో తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్టు, జున్ను, వాము, ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ పొడి వేసి కలపాలి. దీన్ని బంగాళదుంప ముక్కలపై సమంగా పోయాలి. తరువాత మరొక వరుస బంగాళదుంప ముక్కలను పేర్చి క్రీమును అంతటా సమంగా వేయాలి. ఈ పాత్రను ఓవెన్‌లో 25 నిమిషాల పాటు బేక్‌ చేస్తే పొటాటో గ్రాటిన్‌ రెడీ.

Updated Date - 2020-01-04T16:32:44+05:30 IST