లౌకీ హల్వా

ABN , First Publish Date - 2019-10-26T20:04:52+05:30 IST

సొరకాయ - చిన్నది, బాదం - నాలుగైదు పలుకులు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, కోవా - యాభై గ్రాములు, పంచదార..

లౌకీ హల్వా

కావలసినవి
 
సొరకాయ - చిన్నది, బాదం - నాలుగైదు పలుకులు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు, నెయ్యి - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, కోవా - యాభై గ్రాములు, పంచదార - మూడు టేబుల్‌స్పూన్లు, క్రీమ్‌ పాలు - 100ఎంఎల్‌, కుంకుమపువ్వు - కొద్దిగా, యాలకుల పొడి - ఒక టీస్పూన్‌, ఫుడ్‌ కలర్‌ - చిటికెడు, నట్స్‌ - గార్నిష్‌ కోసం కొద్దిగా.
 
తయారీవిధానం
 
ముందుగా సొరకాయ పొట్టు తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. విత్తనాలు ఉంటే తీసివేయాలి. ఒక పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక సొరకాయ గుజ్జు వేసి చిన్నమంటపై వేగనివ్వాలి. కాసేపు వేగిన తరువాత బాదం పలుకులు, జీడిపప్పు వేయాలి. తర్వాత కోవా వేసి కలపాలి. పంచదార, ఉప్పు వేసి మరి కాసేపు వేగించాలి. ఇప్పుడు పాలు పోసి కలియబెట్టాలి. కుంకుమ పువ్వు వేయాలి. మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో కావాలనుకుంటే ఫుడ్‌ కలర్‌ వేసుకోవచ్చు. చివరగా యాలకుల పొడి వేసి, మరికాసేపు ఉంచి దింపుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్‌ చేసి, వేడి వేడిగా తినొచ్చు.

Updated Date - 2019-10-26T20:04:52+05:30 IST