స్వీట్‌ శంకర్‌పాలీ

ABN , First Publish Date - 2019-10-26T20:06:10+05:30 IST

పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడయ్యాక పాన్‌ను స్టవ్‌ పైనుంచి దింపాలి. ఒక పాత్రలో మైదా తీసుకుని అందులో రవ్వ, పంచదార, చిటికెడు ఉప్పు వేసి, వేడి చేసి పెట్టుకున్న నెయ్యి

స్వీట్‌ శంకర్‌పాలీ

కావలసినవి
 
మైదా - అరకేజీ, రవ్వ - పావుకేజీ, పాలు - అరకప్పు, నెయ్యి లేక డాల్డా - ఒక కప్పు, పంచదార - 300గ్రాములు, ఉప్పు - చిటికెడు, నూనె - డీప్‌ఫ్రైకి సరిపడా.
 
తయారీవిధానం
 
పాన్‌లో నెయ్యి వేసి కాస్త వేడయ్యాక పాన్‌ను స్టవ్‌ పైనుంచి దింపాలి. ఒక పాత్రలో మైదా తీసుకుని అందులో రవ్వ, పంచదార, చిటికెడు ఉప్పు వేసి, వేడి చేసి పెట్టుకున్న నెయ్యి వేసి కలపాలి. పాలు పోస్తూ మెత్తటి మిశ్రమంగా వచ్చేంత వరకూ కలపాలి. దానిపై ఒక మెత్తటి వస్త్రం కప్పి పావు గంటపాటు పక్కన పెట్టాలి. తరువాత ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ చిన్న గారెల్లా చేసుకోవాలి. తరువాత డైమండ్‌ ఆకారంలో కట్‌ చేసుకోవాలి. ఒక పాన్‌లో నూనె పోసి కాస్త వేడయ్యాక వాటిని వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించుకుంటే స్వీట్‌ శంకర్‌పాలీ రెడీ. ఈ మహారాష్ట్ర స్వీట్‌ పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2019-10-26T20:06:10+05:30 IST