ఆమ్లా మురబ్బా

ABN , First Publish Date - 2019-11-11T18:04:45+05:30 IST

ఉసిరికాయలు - ఒక కిలో, కెమికల్‌ లైమ్‌ - రెండు టీస్పూన్లు, పంచదార - ఒకటిన్నర కిలో, నీళ్లు - ఆరు కప్పులు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌.

ఆమ్లా మురబ్బా

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కిలో, కెమికల్‌ లైమ్‌ - రెండు టీస్పూన్లు, పంచదార - ఒకటిన్నర కిలో, నీళ్లు - ఆరు కప్పులు, నిమ్మరసం - ఒక టేబుల్‌స్పూన్‌.
 
తయారీ విధానం: ముందుగా ఫోర్క్‌ సహాయంతో ఉసిరికాయలకు రంధ్రం చేయాలి. తరువాత నీళ్లలో ఒక టీస్పూన్‌ కెమికల్‌ లైమ్‌ వేసి, అందులో ఉసిరికాయలు వేసి రాత్రంతా నాననివ్వాలి. ఉదయాన్నే ఆ నీళ్లన్నీ తీసేసి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి మళ్లీ ఒక రాత్రంతా లైమ్‌ నీటిలో నానబెట్టాలి. తిరిగి ఉదయాన్నే నీళ్లు తీసేసి ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉసిరికాయలను బాగా పిండాలి. అప్పుడే వాటిలో మిగిలి ఉన్న లైమ్‌ పూర్తిగా పోతుంది. ఒక పాత్రలో నీళ్లు మరిగించి అందులో ఉసిరికాయలు వేయాలి. ఉసిరికాయలు మెత్తగా అయ్యాక నీళ్లు ఒంచేసి పక్కన పెట్టుకోవాలి. మరొక పాత్రలో నీళ్లు పోసి పంచదార పానకం తయారు చేసుకోవాలి. అందులో కొద్దిగా నిమ్మరసం వేయాలి. తరువాత ఉసిరికాయలు వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడకనిస్తే రుచికరమైన ఉసిరి మురబ్బా సిద్ధమైనట్టే! దీన్ని చల్లారిన తరువాత జాడీలో భద్రపరుచుకోవాలి.

Updated Date - 2019-11-11T18:04:45+05:30 IST