ఉసిరికాయ అచార్‌

ABN , First Publish Date - 2019-11-11T18:07:22+05:30 IST

ఉసిరికాయలు - ఒక కిలో, ఆవాల నూనె - పావుకిలో, ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఇంగువ - రెండు టేబుల్‌స్పూన్లు.

ఉసిరికాయ అచార్‌

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కిలో, ఆవాల నూనె - పావుకిలో, ఆవాలు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్‌, ఇంగువ - రెండు టేబుల్‌స్పూన్లు.
 
తయారీ విధానం: ముందుగా ఉసిరికాయలను పావుగంట పాటు ఉడికించాలి. తరువాత ఆ నీళ్లను ఒంపేసి ఉసిరికాయలను ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ, కారం వేసి వేగించాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేసి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఉసిరికాయలకు మసాలా బాగా పట్టేంత వరకు వేగిస్తే ఉసిరికాయ అచార్‌ రెడీ. చల్లారిన తరువాత జార్‌లో పెట్టుకుని భద్రపరుచుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది.

Updated Date - 2019-11-11T18:07:22+05:30 IST