ఉసిరికాయ చట్నీ

ABN , First Publish Date - 2019-11-11T18:08:05+05:30 IST

ఉసిరికాయలు - ఒక కప్పు(ఉడికించి, గింజలు తీసేసి ముక్కలు చేసినవి), నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం -

ఉసిరికాయ చట్నీ

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు - ఒక కప్పు(ఉడికించి, గింజలు తీసేసి ముక్కలు చేసినవి), నూనె - ఒక టేబుల్‌స్పూన్‌, సోంపు - ఒక టేబుల్‌స్పూన్‌, ధనియాల పొడి - ఒక టీస్పూన్‌, కారం - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు - రుచికి తగినంత.
 
తయారీ విధానం: పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక సోంపు వేసి వేగించాలి. తరువాత ఉడికించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు వేయాలి. ధనియాల పొడి, కారం, నెయ్యి వేసి కలియబెట్టి మరికాసేపు వేగించాలి. తగినంత ఉప్పు వేసి కలిపి స్టవ్‌పై నుంచి దింపుకోవాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.

Updated Date - 2019-11-11T18:08:05+05:30 IST