మామిడికాయ పచ్చడి

ABN , First Publish Date - 2019-04-27T20:51:11+05:30 IST

మామిడికాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, బెల్లం - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత..

మామిడికాయ పచ్చడి

కావలసిన పదార్థాలు
 
మామిడికాయలు - రెండు, పచ్చిమిర్చి - రెండు, బెల్లం - మూడు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - టేబుల్‌స్పూన్‌, ఎండుమిర్చి - రెండు, ఆవాలు - అర టీస్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, వేరుసెనగలు - 200గ్రాములు, ఎండుమిర్చి - ఆరు, నూనె - కొద్దిగా.
 
తయారుచేసే విధానం
 
మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలను సగానికి కట్‌ చేసి పెట్టుకోవాలి. బెల్లం నానబెట్టుకోవాలి. ఒకపాత్రలో మామిడికాయ ముక్కలను, కట్‌ చేసిన పచ్చిమిర్చి వేసి, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. తరువాత బెల్లం కలపాలి. ఇప్పుడు ఒక పాన్‌లో నూనె వేసి, వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని పచ్చడిపై పోసుకొని చక్కగా కలియబెట్టుకోవాలి.

Updated Date - 2019-04-27T20:51:11+05:30 IST