నువ్వుల ఆవకాయ

ABN , First Publish Date - 2019-05-25T17:26:29+05:30 IST

మామిడికాయ ముక్కలు - కేజీ, నువ్వులు - 250 గ్రాములు, ఉప్పు - 250 గ్రాములు, నువ్వుల నూనె - 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి ముద్ద - 250 గ్రాములు...

నువ్వుల ఆవకాయ

కావలసినవి
 
మామిడికాయ ముక్కలు - కేజీ, నువ్వులు - 250 గ్రాములు, ఉప్పు - 250 గ్రాములు, నువ్వుల నూనె - 500 గ్రాములు, అల్లం వెల్లుల్లి ముద్ద - 250 గ్రాములు, ఆవపొడి - 50 గ్రాములు, పసుపు - టేబుల్‌స్పూన్‌, జీలకర్ర పొడి - 25 గ్రాములు, మెంతిపొడి - టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఆవాలు, జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్‌.
 
తయారీవిధానం
 
మామిడికాయ ముక్కలు శుభ్రంగా తుడిచి పెట్టుకోవాలి. నువ్వులను దోరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఒక గిన్నెలో నువ్వుల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతిపొడి, పసుపు, ఆవపొడి వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక దింపేయాలి. నూనె చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. దీనివల్ల అందులోని పచ్చివాసన పోయి కమ్మగా ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపి ఉంచుకున్న పొడులు, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలియబెట్టాలి. అన్ని ముక్కలకు మసాలా అంటిన తర్వాత తీసి శుభ్రమైన జాడీలోకి తీసుకుని మూతపెట్టి ఉంచాలి. మూడు నాలుగు రోజుల తర్వాత మరోసారి కలిపి వాడుకోవచ్చు. ఇందులో కారం వేయలేదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

Updated Date - 2019-05-25T17:26:29+05:30 IST