కుకుంబర్‌ సూప్‌

ABN , First Publish Date - 2019-06-01T20:17:31+05:30 IST

కీర - రెండు, పెరుగు - టేబుల్‌స్పూన్‌, పుదీనా - సగం కట్ట, వెల్లుల్లి - రెబ్బ, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం

కుకుంబర్‌ సూప్‌

కావలసినవి
 
కీర - రెండు, పెరుగు - టేబుల్‌స్పూన్‌, పుదీనా - సగం కట్ట, వెల్లుల్లి - రెబ్బ, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, చికెన్‌ స్టాక్‌ - రెండు కప్పులు, బ్రెడ్‌ ముక్కలు - రెండు, నూనె - తగినంత. గార్నిష్‌ కోసం... పుదీనా ఆకులు - కొన్ని, కీర ముక్కలు - నాలుగైదు, ఛీజ్‌ - కొద్దిగా.
 
తయారీవిధానం
 
ముందుగా కీర పొట్టు తీసి, కట్‌ చేసుకోవాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్‌ చేయాలి. ఇప్పుడు చికెన్‌ స్టాక్‌, పెరుగు, వెల్లుల్లి రెబ్బ, నిమ్మరసం, పుదీనా ఆకులు, తగినంత ఉప్పు వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లబడే వరకు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. బ్రెడ్‌ను ముక్కలుగా కట్‌ చేసి నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. వాటిపై కొద్దిగా ఛీజ్‌ వేయాలి. చిన్న పాత్రలో కుకుంబర్‌ సూప్‌ తీసుకొని, పైన కీరముక్కలు, పుదీనా ఆకులు వేసి గార్నిష్‌ చేసుకొని చల్లచల్లగా తినొచ్చు.

Updated Date - 2019-06-01T20:17:31+05:30 IST